సిట్ విచారణకు హాజరైన ధారాసింగ్

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సిట్ విచారణకు హాజరైన ధారాసింగ్
– ఫోన్ ట్యాపింగ్‌లో అధికారులకు వాంగ్మూలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాండూరుకు చెందిన కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ విచారణకు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలువురు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇందులో తాండూరుకు చెందిన పలువురు నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం జరిగిందని విచారణ చేపడుతున్న సిట్ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ధారాసింగ్ కు నోటీసులు పంపించారు. ఈ మేరకు మంగళవారం ధారాసింగ్ విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారులకు ధారాసింగ్ తన వాంగ్మూలం అందించారు. అనంతరం బయటకు వచ్చిన ధారాసింగ్ మాట్లాడుతూ గత శాసన సభ ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ అయిందని పోలీసులు నిర్ధారణ చేసి కేసు వ్యవహారానికి సంబంధించిన పలు విషయాలు అడిగినట్లు వెల్లడించారు. కేసు విచారణ భాగంగా ఎప్పుడు పిలిచిన పోలీసులకు సహకరిస్తానని తెలిపారు. అధికారులతో విచారణ ప్రశాతంగా జరిగిందని తెలిపారు.

ఇదికూడా చదవండి…

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత