ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇండ్లు..!
– అర్హులైన ప్రతి లబ్దిదారులకు బిల్లులు మంజూరు
– అంతారంలో 7, సంగెంకలాన్లో ముగ్గురికి అందజేత
– తాండూరు ఎమ్మెల్యే సహాకారంతో మంజూరు
– త్వరలోనే రాజీవ్ యువ వికాస్ రుణాలు
– కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తోన్న బీఆర్ఎస్ ప్రభుత్వం
– వచ్చే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టాలి
– డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇండ్లు అందించి న్యాయం చేస్తోందని ఉమ్మడి జిల్లా డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి. మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్పలు అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ పథకంలో ఇండ్లు నిర్మించుకున్న తాండూరు మండలం అంతారం గ్రామంలో 7 మందికి. సంగెంకథాన్ లో 3 మంది లబ్దిదారులకు మొదటి విడత కింద రూ. 1 లక్ష చొప్పున నిధులు మంజూరు చేసింది. గురువారం తాండూరు మండలం అంతారం గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్పల ఆధ్వర్యంలో బిల్లుల మంజూరు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డిలు హాజరై లబ్దిదారులకు బిల్లులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామిలను నెరవేరుస్తోందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కలలు నెరవేరుతున్నాయన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో నియోజకవర్గానికి 3500లు ఇండ్లు మొదటి విడతలో మంజూరయ్యాయని తెలిపారు.

మొదటి విడతలో ఇండ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు బిల్లులు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషి చేశారని గుర్తుచేశారు. పార్టీల కతీతంగా ఇండ్లులేని లబ్దిదారుల గుర్తించి ఇండ్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. రెండో విడతలో కూడా మళ్లీ 3500 ఇండ్లు మంజూరు చేయించి.. అర్హులైన పేదలకు కేటాయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా త్వరలోనే రాజీవ్ యువ వికాస్ కింద దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులకు త్వరలోనే రుణాలు మంజూరు చేయబోతున్నారని తెలిపారు. పేదలకు రేషన్ కార్డుల జారీని నిరంతరం చేపడుతోందని అన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోందని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఏమి చేయకుండా తెలంగాణను అప్పుల పాలు చేసిందన్నారు. పదేళ్లలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూం ఇచ్చిన పాపానా పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పడుతోందని అన్నారు. వాటిని తిప్పి కొట్టాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే మోసం చేశారని మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప అన్నారు. వచ్చే సర్పంచులు, ఎంపీటీసీల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్దిదారులు నిర్మాణాలను నిబంధనల ప్రకారం పూర్తి చేసుకోవాలని, ఎమ్మెల్యే సహాకారంతో పూర్తి బిల్లులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు బిల్లులు మంజరైన లబ్దిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ హాయంలోనే తమ సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో బిల్లులు మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉదయ భాస్కర్ రెడ్డి, పెండా నర్సింలు, కాంగ్రెస్ యువ నాయకులు హరీశ్వర్ రెడ్డి, కరణ్ కోట్ జగదీష్, మాజీ వార్డు సభ్యులు బీజే శ్రీనివాస్, ఎల్. రాజేందర్ రెడ్డి, వ సీం ఇందిరమ్మ కమిటి సభ్యులు పుల్లా ప్రభాకర్, సీహెచ్ వెంకటమ్మ, పెండా జయమ్మ, జంగని మొగులయ్య, గ్రామ పెద్దలు బొడ్డె అనంతయ్య, కోస్గి ఆశన్న, లాలప్ప, మడుగుల లక్ష్మయ్య, ముస్తఫా, బొడ్డె ప్రభాకర్, తుమ్మలపల్లి రాములు, మ్యాతరి ఉశనప్ప, మౌలానా రఫీక్, తాండ్ర రామకృష్ణ, తాండ్ర స్వామిదాస్, యువకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

