రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు
– ప్రకటించిన జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
– అయితే ఆ నిబంధనలు పాటించాలని సూచన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ బుధవారం, గురువారం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.
kvcs
వికారాబాద్‌ జిల్లాను రెడ్‌ అలెర్ట్‌లో ఉంచారు. దీంతో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాధికారి తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాల మేరకు రేపు, ఎల్లుండి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 14, 15వ తేదిలలో సెలవు పాటించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్, జెడ్పీ పాఠశాలలు సెలవు పాటించాలని సూచించారు.

అయితే 15వ తేది స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. అదేవిధంగా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాఠశాలల భవనాలపై దృష్టిసారించాలన్నారు. షార్ట్ సర్క్యూట్, ఇతర ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. మరోవైపు గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్‌థులకు అవసరమయ్యే సరుకులు ముందుగానే తెచ్చుకోవాలని, విద్యార్థులను బయటకు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి…

బీవీజీ ఫౌండేషన్ గొప్ప మనసు..!