వైన్స్ షాపుకు కన్నం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వైన్స్ షాపుకు కన్నం..!
– మద్యం బాటిళ్లు, నగదు చోరీ
– సీసీ పుటేజీ హర్డ్ డిస్క్ అపహరణ
– యాలాల మండంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వైన్స్ షాపుకు గుర్తుతెలియని దుండగులు కన్నం వేశారు. షాపులోకి చొరబడి అందుబాటులోని మద్యం బాటిళ్లతో పాటు నగదును, సీసీ పుటేజీ హర్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకుపోయారు.

ఈ సంఘటన యాలాల మండలంలో గురువారం వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలో ఉన్న మన యాలాల వైన్స్ షాపును కొందరు పార్టునర్లతో నిర్వహిస్తున్నారు. నిర్వహకులు బుధవారం రాత్రి షాపును మూసి వేసి వెళ్లిపోయారు. గురువారం ఉదయం వచ్చి చూసే సరికి షాపులో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. షాపు వెనుక భాగంలో కన్నం వేసినట్లు గుర్తించారు.

సీసీ పుటేజీ హర్డ్ డిస్క్ కూడా ధ్వంసమై కనిపించింది. షాపులో విలువైన మద్యం బాటిళ్లు, సుమారు 25వేల నగదు, కొంత చిల్లరను కూడా ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ వైర్లను కట్ చేసి డీవీఆర్ ను కూడా ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. జరిగిన సంఘటనపై నిర్వహకులు యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదికూడా చదవండి…

పండగలా కేటీఆర్ జన్మదినం