బీసీ రిజర్వేషన్లపై స్టే.. విచారకరం..!
– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కుతో అడ్డంకులు
– డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం విచారకరమని డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ అన్నారు.

గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు అమలుపై హై కోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుంకుల పరిణామాలు చోటు చేసుకున్నాయని అన్నారు.
బీసీలకు రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో 42శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించి.. గవర్నర్కు పంపించడం జరిగిందన్నారు. కేంద్రం ఆమోదించకపోవడంతో అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు. బీసీలు నిరాశకు గురికావద్దని అన్నారు. పార్టీ అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ఇదికూడా చదవండి…

