ఖిలాడీ విషాల్…!
– ఫేక్ ఐడీలతో లోన్‌ల ప్లాన్
– పనిచేసే సంస్థకే సున్నం
– ఆడిట్‌లో బయటపడిన బాగోతం
– ముణప్పరం మేనేజర్ స్కెచ్ ప్లాఫ్
– సంచలన కేసు చేధించిన జిల్లా పోలీస్
– వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పనిచేస్తున్న ఫైనాన్స్ కంపెనీలో లూప్ పోల్స్‌ను ఆసరా తీసుకుని సంస్థ సొమ్మును కాజేయాలని ప్లాన్ వేశాడు. నకీలీ ఐడీలు సృష్టించి అవసరం మేర డబ్బులు దోచుకునేందుకు స్కెచ్ వేశాడు. ఫేక్ లోన్‌ల బాగోతం ఆడిట్ ద్వారా బయటపడక ముందే దొంగగా ముద్రవేసుకుని పారియాడు. సంస్థల అధికారుల ఫిర్యాదుతో పోలీసులకు పట్టుబడి కటకటాల్లోకి వెళ్లాడు. వికారాబాద్ జిల్లా సంచలనంగా మారిన ముణప్పురం ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ చేసిన ఫ్రాడ్.. చోరీ.. మీస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాకు వివరించారు.
ఎడాదికే.. ఎగనామం…
కర్ణాటక రాష్టం లోని ఔరద్ తాలూకాలోని నారాయణపూర్‌కు చెందిన ప్రాంతానికి చెందిన విశాల్ గత యేడాది జులైలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మణప్పురం ఫైనాన్స్ లిమిటేడ్‌లో మేనేజర్‌గా నియామకం అయ్యారు. ఈ బ్యాంకులో ఆధార్ కార్డు, పాన్ కార్డు, మోబైల్ నెంబర్ తీసుకుని వినియోగదారులకు ప్రత్యేక ఐడీ రూపొందించి గోల్డ్ లోన్ ఇస్తారు. ఒకసారి ఐడీ రూపొందిన తరువాత కస్టమర్ ఎన్నిసార్లైనా గోల్డ్ పెట్టి లోన్ తీసుకోవచ్చని నిబంధన ఉంది. బ్యాంకు మేనేజర్‌గా నియామకమైన విషాల్‌కు కూడా సంస్థ నుంచి గోల్డ్ లోన్ చేయించాలని టార్గెట్ ఇచ్చారు. ఈ మేరకు కంపెనీలో ఉన్న లూప్ ఫోల్స్‌ను వాడుకుని 20మందికి పైగా కస్టమర్ల పేరుతో 63 ఫేక్ ఐడీలను సృష్టించాడు. వాటి ద్వారా సుమారు రూ. 1కోటి 24లక్షలు కాజేశాడు.
ఆడిట్‌లో దొరకకుండా ప్లాన్
మద్యలో ఎవరైనా ఆడిట్‌కు వస్తే దొరికిపోకుండా ఉండేందుకు ప్లాన్ సిద్దం చేసుకున్నారు. ఆడిట్ అధికారులు వస్తున్నారన్న విషయం ముందే తీసుకుని.. ఏయే ఐడిలతో పేరుతో ఆడిట్ నిర్వహిస్తారో అదికూడా ముందే తెలసుకుని ఆయా ఐడీలలో వాటికి తగ్గ బంగారం సర్దుబాటు చేసేవాడు. ఇలా దొరకకుండా తప్పించుకునేవాడు. ఇదేవిధంగా సంస్థలో డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు. అప్పటికే దోచుకున్న డబ్బులో బెట్టింగ్‌లతోపాటు కొంత అవసరాలకు వాడుకున్నాడు. అయినా డబ్బులపై దురాశతో ఈ క్రమంలో సంస్థలోని 5 ప్యాకెట్లను దొంగలించి పారిపోయాడు. ఆ తరువాత అధికారులు వచ్చి తనిఖీలు చేయడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సంస్థకు చెందిన రీజీనల్ మేనేజర్ రవీంద్ర కూమారు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడు విషాల్‌ను సొంత గ్రామం నారాయణపూర్‌లో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
కస్టమర్ల గోల్డ్ సేఫ్..
మునప్పరంలో గల ఏ కస్టమర్ గోల్ సేఫ్‌గా ఉందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. నిందితున్ని వికారాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి 5 బంగారం ప్యాకెట్లు లోని 83గ్రాముల బంగారం, 10 లక్షల రూపాయల డబ్బులను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. కంపెనీలో కస్టమర్స్ యొక్క ఏ బంగారము దొంగలించ బడలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితునికి సహకరించిన వికారాబాద్ మణప్పురం ఉద్యోగులు అయిన జూనియర్ అసిస్టెంట్ లు శివప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి మరియు ఆడిటర్ రాజకుమార్‌లతో పాటు బెట్టింగ్ నిర్వహకులపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసులో పని చేసిన వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతయ్య, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్, ధారూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘురాములు, ఇతర అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఇదికూడా చదవండి…

