తాండూరుకు తెలంగాణ డిప్యూటీ సీఎం రాక
– భట్టి విక్రమార్కతో పాటు శ్రీదర్ బాబు, గడ్డం ప్రసాద్ కుమార్
– పర్యటన షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు
– రేషన్ లబ్దిదారులకు కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటన ఖరారయ్యింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 29వ తేదిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా పర్యటనలో పాల్గొంటున్నారు. యాలాల మండలంలోని జుంటుపల్లి దేవాలయంలో భట్టి విక్రమార్క, మంత్రి, స్పీకర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తాండూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణంకు శంకుస్థాపన చేయనున్నారు.

అదేవిధంగా నియోజకవర్గంకు మంజూరైన సుమారు రూ. 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కొండాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్, చెన్ గెష్పూర్ సబ్ స్టేషన్, నారాయణపూర్ సబ్ స్టేషన్, బెల్కటూర్ సబ్ స్టేషన్, పాషాపూర్ సబ్ స్టేషన్, హాజీపూర్ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు అదేరోజు తాండూరు మున్సిపల్, తాండూరు మండలం, పెద్దేముల్ మండలాలకు చెందిన రేషన్ లబ్దిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఇదికూడా చదవండి..

