యువత మత్తు జోలికి వెళ్లొద్దు..!
– నశా ముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం
– విద్యార్థులు, మెప్మా సిబ్బందితో ప్రతిజ్ఞ, పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత మత్తు జోలికి వెళ్లొద్దని పలువురు అధికారులు సూచించారు. మంగళవారం నశా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ. పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ కాలేజీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ యాదగిరి, ఎక్సైజ్ సీఐ రాణి, ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్, పలువురు అధికారులు పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి వెళ్లొదని అన్నారు. మత్తుకు బానిసలు అయితే జీవితాలు నాశనమవుతాయని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఎక్సైజ్ అధికారులు రవికుమార్, నిజాముద్దీన్, మెప్మా టీఎంసీ రాజేంద్రప్రసాద్, శానిటరీ ఇను స్పెక్టర్లు వెంకటయ్య, టీపీబీఓలు ప్రియా, నరేష్, వంశీధర్, ఈఈ ప్రవీణ్ గౌడ్, వార్డు ఆఫీసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

