అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వెబ్‌సైట్‌లో న‌మోదు చేయాలి

తాండూరు వికారాబాద్

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వెబ్‌సైట్‌లో న‌మోదు చేయాలి
– వికారాబాద్ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ మోతిలాల్
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్ర‌భుత్వం వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నివేధిక‌ల‌ను న‌మోదు చేయాల‌ని వికారాబాద్ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ మోతిలాల్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అద‌న‌పు క‌లెక్ట‌ర్ మోతిలాల్ మాట్లాడుతూ, మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ శాఖల ద్వారా ప్రతి మాసము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పెరఫార్మెన్స్ వివరాలను ప్రతి నెల 5వ తేదీ వరకు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ వెబ్ సైట్‌లో పొందుపర్చాలని సూచించారు. ప్రతి నెల మాస, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక ద‌శ‌ల వారిగా నివేదికలను న‌మోదు చేయాల‌న్నారు. ఇందుకోసం ప్రతి కార్యాలయం నుండి ఒక సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. ఆయా శాఖ‌ల‌ సమాచారం రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ వరకు పరిశీలించడం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించ‌రాద‌ని హెచ్చ‌రించారు. ఈ సమావేశంలో సీపీవో నిరంజన్ రావు, డి ఆర్ డి ఓ కృష్ణన్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.