మాటల్లేవ్.. చేతల్లో చూపిస్తా..!

తాండూరు రాజకీయం వికారాబాద్


మాటల్లేవ్.. చేతల్లో చూపిస్తా..!

– దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట
– హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : నేను మాటల మనిషిని కాను.. చేతల్లో పనులన్నీ చేయించి చూపిస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గం ఖాంజాపూర్ సమీపంలో హిందూ ఉత్సవ సమితి నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
kvcs
ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు స్వప్న పరిమళ్, కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, డా. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఏటీసీ సెంటర్ కు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన హిందూ ఉత్సవ సమితి భవన నిర్మాణంను సాకారం చేయడం జరిగిందన్నారు.

ఇందుకోసం రూ.50లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. నేను మాటలు మనిషిని కాను, కాని పనులు పక్కాగా చేయిస్తానని ఉద్ఘాటించారు. తాండూరు నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలకు కమిటిలను వేయడం జరిగిందని అన్నారు. భద్రేశ్వర దేవాయలంలో టెంకాయలు కొట్టారు తప్పా.. దాసోహం కట్టించలేకపోయారని, మేము వచ్చాకా దాసోహం కట్టించామన్నారు. దీంతో పాటు యాలాల జుంటుపల్లి, బషీరాబాద్ ఏకాంబరి దేవాలయాలకు రోడ్లు వేయిస్తున్నామన్నారు.

ఏటీసీ సెంటర్, ఇంటిగ్రేట్ స్కూళ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఎవరి పార్టీ వారిదని, ఎన్నికల ముగిశాకా అభివృద్ధిలో అందరితో కలిసి సాగుతామన్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహాకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు. హిందూ సంఘాల ప్రతినిధులు, హిందూ బందవువులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

స్కావెంజర్స్ గ్రాంట్ విడుదల చేయించండి