బిపిన్ రావత్ మరణం తీరనిలోటు
– ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత దేశ తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దేశానికి తీరనిలోటని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో హెలీక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావతోపాటు 11 మంది సైకులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బిపిన్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనిన్నారు. ఆయన మరణం దేశ రక్షణ రంగానికి తీరనిలోటని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనియర్ కౌన్సిలర్ పద్దోళ్ల నీరజా బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్లు ముక్తార్ నాజ్, బోయరవి, వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, అజయ్ ప్రసాద్ యువనాయకులు బిర్కణ్ రఘు. అశోక్ తదితరులు పాల్గొన్నారు.
