స్కావెంజర్స్ గ్రాంట్ విడుదల చేయించండి

తాండూరు రాజకీయం వికారాబాద్


స్కావెంజర్స్ గ్రాంట్ విడుదల చేయించండి

– తాండూరు ఎమ్మెల్యేకు పీఆర్టీయూ వినతి
– వెంటనే కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న స్కావెంజర్లకు వేతనాల కోసం గ్రాంట్ నిధులు మంజూరు చేయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పీఆర్టీయూ నేతలు కోరారు. శనివారం యాలాల మండల పీఆర్టీయూ శాఖ ద్వారా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
kvcs
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, మొక్కలకు నీరు పోయడానికి సేవాభావంతో స్కావెంజర్లను నియమించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. వారికి 3 నెలల వేతనాన్ని స్కూల్ మేయింటెన్స్ నుంచి చెల్లించడం జరిగిందని, ఇంకా 7 నెలలకు సంబంధించి గ్రాంట్ విడుదల కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. స్కావెంజర్ గ్రాంట్ నిధులు మంజూరు చేయించేలా చూడాలని కోరారు. జిల్లా కలెక్టర్ ద్వారా గ్రాంటు నిధులు మంజూరు చేసేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా అందించారు. ఇందుకు పీఆర్టీయూ నాయకులు కృష్ణారెడ్డి, రాములు, శ్రీధర్ రెడ్డి, మొగులప్ప, జీ. నర్సిరెడ్డి, ఎల్. నర్సిరెడ్డిలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి..

నాయకత్వంతోనే నైతిక విలువలు