8న హిందూ ఉత్సవ సమితి సమావేశం

తాండూరు రాజకీయం వికారాబాద్

8న హిందూ ఉత్సవ సమితి సమావేశం
– సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు
– కార్యస్థలం, సమయం వివరాలు ఇలా
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాలపై తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి దృష్టి సారించింది. ప్రతి యేడాది మాదిరిగానే వినాయక చవితి ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు కార్యాచరణ చేపడుతోంది.
kvcs
ఇందులో భాగంగా ఎల్లుండి 8వ తేది తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమితి ప్రధాన కార్యద పట్లోళ్ల నర్సింలు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడా జరిగిందని చెప్పారు.

ఈ సమావేశానికి తాండూరు పట్టణంలోని 36వార్డులకు సంబంధించిన సమితిల సభ్యులు, హిందూ బందువులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి యేడాది మాదిరిగా సమావేశం ఏర్పాటు చేసుకుని చేపట్టే కార్యాచరణ, సమితి నిర్ణయాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కావున సమావేశానికి హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఇదికూడా చదవండి…

యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి