సార్వత్రిక సమరం..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సార్వత్రిక సమరం..!
– 7 విడతలంలో ఎన్నికలు
– నాలుగో విడతలోనే ఏపీ, తెలంగాణ  
– మిగతా విడతల తేదిలు ఖరారు
దర్శిని డెస్క్ : భారత దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమరం సిద్దమయ్యింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.

గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం 543 స్థానాలకు ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 7విడతల్లొ లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న వెలువడుతుంది. ఏప్రిల్‌ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుంది.

దశలవారీ పోలింగ్ తేదీలు ఇవే..
ఏప్రిల్‌ 19 .. తొలిదశ పోలింగ్‌
ఏప్రిల్‌ 26 – రెండో దశ పోలింగ్‌
మే 7 న – మూడో దశ పోలింగ్‌
మే 13 – నాలుగో దశ పోలింగ్
మే 20 – ఐదో దశ పోలింగ్
మే 25 – ఆరో దశ
జూన్ 1న – ఏడో దశ

లోక్‌సభ: తొలి దశ
నోటిఫికేషన్‌: 20 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19
లోక్‌సభ : రెండో విడత
నోటిఫికేషన్‌: 28 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 04
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 5వ తేదీ
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 8
పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 26
లోక్‌సభ: మూడో దశ
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 12, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 19
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 20
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 22
పోలింగ్‌ తేదీ: మే 7
లోక్‌సభ: నాలుగో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 26
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 29
పోలింగ్‌ తేదీ: మే 13
లోక్‌సభ: ఐదో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 26, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
నామినేషన్ల పరిశీలన: మే 4
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
పోలింగ్‌ తేదీ: మే 20
లోక్‌సభ: ఆరో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 29, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
నామినేషన్ల పరిశీలన: మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
పోలింగ్‌ తేదీ: మే 25
లోక్‌సభ: ఏడో విడత
నోటిఫికేషన్‌: మే 7, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన: మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
పోలింగ్‌ తేదీ: జూన్‌ 1

సార్లు వస్తున్నారు..!