వృద్ధులకు ఆర్టీసీ అదిరే ఆఫర్…!
– ప్రయాణ టిక్కెట్లపై రాయితీ
– కసరత్తు చేస్తోన్న సంస్థ
– ఈ నిర్ణయం ఎందుకోసమంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : వివిధ ప్రాంతాలకు ప్రయాణించాలనుకునే వృద్ధుల కోసం ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ సంస్థ అధిరే ఆఫర్ అందించబోతోంది. బస్సు ప్రయాణికుల్లో వృద్ధులకు టికెట్‌పై రాయితీ కల్పించేందుకు నిర్ణయించింది.

సంస్థ బస్సుల్లో ప్రయాణిస్తే వృద్ధులకు రాయితీ ఇచ్చే పథకాలు పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. ఈ విధానంను తెలంగాణలో కూడా అమలు చేయాలని భావించి ఇందుకోసం తీవ్ర కసరత్తు చేస్తోంది. వృద్ధులకు బస్ టికెట్లపై రాయితీ కల్పిస్తే ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.

ఇప్పటికే బాలికలు, మహిళల ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ కలిసి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో నిత్యం 34 లక్షలకు పైచిలుకు బాలికలు, మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. అయితే ఈ పథకం ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితం. కేవలం తెలంగాణ వాసులకే వర్తిస్తుంది. అయితే వృద్ధులకు కల్పించే రాయితీని అన్ని రకాల బస్సులకు వర్తింపజేసే ప్రతిపాదన ఆర్టీసీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం ఎందుకోసమంటే…?
మహాలక్ష్మి ప్రయాణాల టికెట్ల డబ్బు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావడానికి కాస్త సమయం పడుతోంది. ఈ కారణంగా ఉద్యోగులకు జీతాలు, డీజిల్, ఇతర ఖర్చులకు ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సంస్థ కొంత ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల ద్వారా నేరుగా వచ్చే ఆదాయాన్ని చెల్లించేందుకు అధికారులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే వృద్ధులకు టికెట్‌పై రాయితీ అంశాన్ని చర్చిస్తున్నట్లు సమాచారం. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ తన ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి మౌఖికంగా తీసుకెళ్లినట్లు సమాచారం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను త్వరలోనే కలిసి లిఖితపూర్వకంగా వివరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి….

