బీసీలను విస్మరిస్తున్న బీజేపీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీలను విస్మరిస్తున్న బీజేపీ..!
– రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వక పోవడం దుర్మార్గం
– రాజాసింగ్ నామినేషన్ విషయంలో అన్యాయం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ(బీజేపీ) బీసీలను విస్మరిస్తోందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించకుండా వివక్ష చూపిందని విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ముగ్గురు బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు అనేక మంది సీనీయర్ నేతలు అర్హులుగా ఉన్నకూడా అవకాశం కల్పించకపోవడం దుర్మార్గమే అని అన్నారు. గతంలో బీసీల నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, కనీసం శాసనసభ పక్ష నేతగా కూడా బీసీలకు అవకాశం కల్పించలేదని గుర్తుచేశారు.

ఇప్పుడు బీసీ నాయకుడికి అధ్యక్షుడిగా నియమిస్తారని ఆశిస్తే చివరి క్షణంలో బీసీలకు మొండి చెయ్యి చూపించారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను నియమిస్తే తెలంగాణలో బీజేపీ మరింత బలపడేందుకు అవకాశం ఉండేందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్ ను అనుమతించకపోవడం దుర్మార్గమే అని అన్నారు. బీసీలను విస్మరించిన బీజేపీకి రానున్న రోజుల్లో ఆదరణ తగ్గడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

మొక్కజొన్నలో పోషకాలు..!