కుర్వ జగదీష్‌కు ఎమ్మెల్యే పరామర్శ

తాండూరు రాజకీయం వికారాబాద్

కుర్వ జగదీష్‌కు ఎమ్మెల్యే పరామర్శ
– ఆసుపత్రికి వెళ్లి పరిశీలించిన మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన తాండూరు బీజేపీ యువనాయకుడు కుర్వ జగదీష్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు.

రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన కుర్వ జగదీష్ ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ దక్కన్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుర్వ జగదీష్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కుర్వ జగదీష్ కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

అందరినీ కరుణించు దత్తాత్రాయే ..!