బంటు మల్లప్ప ఇంటికి బీఎంఆర్..!
– శుభకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకుడు బంటు మల్లప్ప ముదిరాజ్ ఇంటికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెళ్లారు.

గురువారం సాయిపూర్ లో బంటు మల్లప్ప నూతన గృహా ప్రవేశ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడులకు హాజరు కాలేకపోయినందుకు శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా బంటు మల్లప్ప ఇంటికి వెళ్లారు. నూతన గృహా ప్రవేశం సందర్భంగా బంటు మల్లప్పకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం బంటు మల్లప్పతో కలిసి భోజనం చేశారు. అదేవిధంగా శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా బంటు మల్లప్ప కుటుంబ మహిళలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రాఖీలు కట్టారు. మరోవైపు తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని బంటు మల్లప్ప శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్, బంటు వేణుగోపాల్, సత్యమూర్తి దొరశెట్టి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

