వైభవంగా రాఖీ పౌర్ణమి

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా రాఖీ పౌర్ణమి
– ప్రతి ఇంట్లో వెల్లివిరిసిన కోలాహలం
– ముస్లిం సోదరులకు కూడా రాఖీలు
– ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నా చెల్లెల్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణవి సిని శనివారం తాండూరు ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమిని ఆడపచుడులు సహోదర, సోదరులకు రాఖీలు కట్టి పండుగను సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు.
kvcs
అన్నా తమ్ముళ్లకు అక్కా చెల్లెల్లు మిఠాయిలు తినిపించి సోదరులకు రాఖీలు కట్టారు. రాఖీపౌర్ణమి సందర్భంగా పుట్టింటినుంచి అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలు అన్నలకు, తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు రావడంతో వారి వారి ఇళ్లల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.

తాండూరుకు వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజుల మాధవి, పలువురు మహిళ నాయకులు రాఖీలు కట్టారు. అదేవిధంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు తన నివాసంలో ముస్లిం సోదరులకు రాఖీ కట్టారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కూడ తన నివాసంలో మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీకి, మాజీ కౌన్సిలర్ ముక్తార్ లకు రాఖీలు కట్టారు. ఇంటింటి రాఖీ పండగ వేడుకలతో తోబుట్టువులకు అండగా ఉంటామనే భరోసానిస్తూ ప్రేమాభిమానం కలిగిన అందరు ప్రజలు కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకున్నారు.

ఇదికూడా చదవండి…

వినూత్నం.. వృక్షా బంధన్..!