తాండూరుకు ఉత్తమ అవార్డుల పంట..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరుకు ఉత్తమ అవార్డుల పంట..!
– జిల్లా ఉత్తమ అధికారిగా మైన్స్ ఏడీ సత్యనారయణ
– ప్రతిభ పురస్కారాలు అందుకున్న అధికారుల జాబితా ఇదే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో ప్రభుత్వ శాఖల అధికారులు ఉత్తమ పని తీరుతో ప్రతిభను కనబరిచారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల చేతుల మీదుగా ఉత్తమ అవార్డులను అందుకున్నారు.
kvcs
తాండూరు నియోజకవర్గం వారిగా వివిధ శాఖల నుంచి అవార్డుల అందుకున్న అధికారులు జాబితా ఈ విధంగా ఉంది. మైన్స్ శాఖ నుంచి జిల్లా ఉత్తమ అధికారిగా మైన్స్ ఏడీ సత్యనారాయణ ప్రశంస పత్రం అందుకున్నారు. ఇదే విధంగా ఉత్తమ సర్వేయర్ గా లక్ష్మీనారాయణ, రెవెన్యూ శాఖ నుంచి జూనియర్ అసిస్టెంట్ లు నరేష్, నాగమణిలు ఉత్తమ అవార్డులు అందుకున్నారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జూనియర్ అసిస్టెంట్ అనురాధ, ఓఎస్ వై.నర్సింలు, కంప్యూటర్ అపరేటర్ నర్సింలులు ఉత్తమ పురస్కారాలు పొందారు. డీపీఓ నుంచి ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా గౌతాపూర్ పంచాయతీ కార్యదర్శి ఫక్రోజీ, బీసీ అభివృద్ధి శాఖ నుంచి ఉత్తమ వార్డెన్ లుగాభాగ్యలక్ష్మీ(బీసీ బాలికల వసతిగృహం -యాలాల), సుందరమ్మ(బీసీ బాలికల వసతిగృహం తాండూరు), శ్రీశైలం(బీసి బాలుర వసతిగృహం -తాండూరు)లు అవార్డులు అందుకున్నారు.

అదేవిధంగా విద్యుత్ శాఖ నుంచి ఎల్ఎం వెంకటలక్ష్మీ రెడ్డి, వైద్య విధాన పరిషత్ కింద మాతా శిశు ఆసుపత్రి డా. సునీత(సివిల్ సర్జన్), థియేటర్ అసిస్టెంట్ మహేష్, జిల్లా ఆసుపత్రి నుంచి స్టాఫ్ నర్స్ కృష్ణవేణిలు అవార్డులు అందుకున్నారు. వారితో పాటు పోలీసు శాఖ తరుపున ఉత్తమ హెడ్ కానిస్టేబుల్ గా దస్తప్ప(పెద్దేముల్), ఉత్తమ కానిస్టేబుళ్లుగా సాయప్ప (తాండూరు టౌన్), ప్రతాప్ సింగ్(కరణ్ కోట్)లు ప్రశంసా పత్రాలను అందుకున్నారు.

ఇదికూడా చదవండి…

శభాష్‌ భోగిని మమత..!