శభాష్‌ భోగిని మమత..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

శభాష్‌ భోగిని మమత..!
– అభినందించిన స్పీకర్, జిల్లా కలెక్టర్
– ఇంటర్‌లో ప్రతిభకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్‌ భోగిని మమత అంటూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు ఇంటర్ విద్యార్థినిని అభినందించారు.
kvcs
శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పీకర్ ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల సమక్షంలో ఉత్తమ ప్రతిభా వంతులను అభినందించి.. ప్రశంస పత్రాలను అందజేశారు.

అయితే యాలాల మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన భోగిని మమత ఇంటర్మీడియట్‌లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గాను స్పీకర్ ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రదీప్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంది. నగదును ప్రోత్సహాంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థిని భోగిని మమతను శభాష్ అంటూ అభినందించారు. స్పీకర్, కలెక్టర్‌ల చేతుల మీదుగా అభినందనలు పొందడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

ఉత్తమ ఏఈఓగా శెట్టి సౌమ్య