హస్తం.. ‘పుర’విప్పుతోంది…!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తం.. ‘పుర’విప్పుతోంది…!
– నేడు మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన..?
– అన్ని వార్డుల పోటీదారుల జాబితా సిద్దం
– ఎమ్మెల్యే సమావేశంపై ఆసక్తి..
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలపై అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ అన్ని వార్డు చేస్తామని సంకేతాలు ఇచ్చింది. మున్సిపల్‌లో ఓటర్ల జాబితా నుంచి.. రిజర్వేషన్ల ప్రకటన వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో మౌనం పాటించింది.

చైర్మన్, కౌన్సిలర్ల అభ్యర్థుల వివరాలను బయటకు రానీయలేదు. చివరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటికి స్తబ్దుగానే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటో ఎవ్వరికి అర్థం కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ వార్డు నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనే వివరాలను సస్పెన్స్‌గానే ఉన్నారు. ఈ విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. వార్డుల్లో ముందునుంచి పోటీ చేయాలనే భావించిన వారిని కాకుండా మరోకరికి చాన్స్‌ ఇస్తున్నారనే ఆందోళనకు గురయ్యారు.

అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని వారినే పోటీలో నిలపాలని భావించినట్లు ప్రచారం జరిగింది. ఎన్ని జరిగినా ఐదు, ఆరుగురు అభ్యర్థుల పోటీ ఖాయమని ప్రచారం జరిగింది. మిగతా వార్డుల విషయంలో ఎవరు పోటీ చేస్తారనే స్పష్టత రాలేదు. సీనీయర్ నేతలు సైతం తమకు టిక్కెట్‌ వస్తుందో లేదో అని ఆందోళనకు గురయ్యారు. నేటితో ఈ సస్పెన్‌కు తెరపడబోతోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు నేటి నుంచే ప్రారంభం కాబోతుండడంతో అభ్యర్థుల ప్రకటన కూడా నేడే జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి అభ్యర్థుల ప్రకటన చేస్తారని తెలిసింది. నేటితో కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడిన సస్పెన్‌కు ఎండ్ పడబోతోంది. కౌన్సిలర్ల అభ్యర్థులను ప్రకటించినప్పటికి.. చైర్మన్ అభ్యర్థి ఎవరనేది చివరి వరకు తేలే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది.

ఇదికూడా చదవండి…

మున్సిపల్‌లోనే నామినేషన్లు…!