కొత్త కమీషనర్‌ జాయినింగ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కొత్త కమీషనర్‌ జాయినింగ్..!
– తాండూరుకు ఎలా వచ్చానో చెప్పిన కమీషనర్‌
– వచ్చిరాగానే అన్ని విభాగాల అధికారులతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కొత్త కమీషనర్‌గా బి.యాదగిరి జాయిన్ అయ్యారు. మున్సిపల్లో ఏసీబీ అధికారుల దాడుల నేపథ్యంలో ఇక్కడ కమీషనర్ గా పనిచేస్తున్న విక్రమ్ సింహారెడ్డిని బదిలీ చేశారు.
kvcs
ఆయన స్థానంలో గ్రేడ్ – 3 స్థాయిలో ఉన్న యాదగిరిని తాండూరు మున్సిపల్ కమీషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం మున్సిపల్ కమీషనర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లోకేషన్ పెట్టుకుని గూగుల్ మ్యాప్ ద్వారా తాండూరుకు వచ్చానని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాలను సమగ్రంగా సమీక్షిస్తామని అన్నారు.

మున్సిపల్ నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దృష్టిసారిస్తామన్నారు. పారిశుద్ధ్యంతో పాటు పౌరసేవలలో ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ప్రజ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం వచ్చి రాగానే మున్సిపల్ లోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వార్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

మందుబాబులకు షాక్…!