మందుబాబులకు షాక్…!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మందుబాబులకు షాక్…!
– వాహనాలు నడిపిన ఇద్దరికి జైలు
– మరో 78 మందికి జరిమానాలు
– శిక్ష విధించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్
– వివరాలు వెల్లడించిన తాండూరు పట్టణ సీఐ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మందుబాబులకు వికారాబాద్‌ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ హర్ష చౌదరి షాక్ ఇచ్చారు.
kvcs
ఇద్దరు నిందితులకు జైలు శిక్ష, మరో 78 మందికి జరిమానాలు విధించారు. ఈ విషయాన్ని గురువారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన గొర్ల స్టాలిన్ కు 3 రోజులు జైలు శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా, అదేవిధంగా తాంఊడరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన నడిమింటి శ్రీనివాస్ కు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమాన విధించారని వెల్లడించారు.

అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన మరో 78 మందికి రూ. 1లక్ష 14వేలు జరిమాన విధించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరిత్య చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

పండగలు నిర్విఘ్నంగా నిర్వహించాలి