హిందూ ఉత్సవ సమితికి మహర్ధశ
– సమితి స్థలంలో బోరు నిర్మాణం
– ప్రారంభించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని హిందూ ఉత్సవ కేంద్ర సమితికి మహర్దశ వచ్చింది. హైదరాబాద్ రోడ్డు మార్గంలో కేటాయించిన స్థలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ఆదివారం సమితి స్థలంలో బోరు మోటారు ఏర్పాటు పనులు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరై బోరు పనులను పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలులు శ్రీనివాస్ రెడ్డిని సన్మానించాంరు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితి అభివృద్ధి చెందడం పట్ల సంతొ షం వ్యక్తం చేశారు. సమితికి కార్యక్రమాలకు తమవంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. మరోవైపు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కూడా హాజరై పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్, భరత్ రెడ్డి, రాము, హిందూ ఉత్సవ సమితి కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, ఉపాధ్యక్షులు గూలి పరమేశ్వర్ స్వామి, కోటం ప్రసాద్, సహాయ కార్యదర్శులు వెంకటేశం(మిర్చి), మంతన్ గౌడ్ అశోక్, రజక నర్సింహా, వడ్డె పరమేష్, లొ కేష్, శ్రీకాంత్ రెడ్డి, దివిటి ఎల్లప్ప, వడ్డె శ్రీనివాస్, దావులయ్య, ప్రచార కార్యదర్శులు కుమార్ వాల్మీకీ, గోపాల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

