ఏటీసీతో అద్భుత భవిత..!

కెరీర్ టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

ఏటీసీతో అద్భుత భవిత..!
– చేరితే ఉపాధి.. ఉద్యోగం గ్యారెంటీ
– తాండూరు యువతకు సువర్ణ అవకాశం
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ప్రభుత్వ కాలేజీ
– కాలేజీని సందర్శించిన కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐటీఐలో భాగంగా వచ్చిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ద్వారా యువతకు అద్భుత మైన భవిష్యత్తును పొందడం ఖాయమని తాండూరు కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
kvcs
ఆదివారం తాండూరులో నిర్మించిన ఏటీసీ సెంటర్ ను తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్ తదితరులు సందరి ్శంచారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం ఏటీసీ కాలేజీలను మంజూరు చేసిందన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ఏటీసీ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారని అన్నారు.

గత ప్రభుత్వం కాగితాలకే పరిమితమైతే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దాదాపు రూ.90 కోట్లతో కాలేజీని అందుబాటులోకి తీసుకవచ్చారని అన్నారు. ఇందులో రూ. 60 కోట్లు వివిధ కోర్సులకు అవసమయ్యే పరికరాల కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. తాండూరు ఏటీసీలో 6 అత్యాధునికమైన కోర్సులను అందుబాటులోకి తీసుకవచ్చారని, ఈ కోర్సుల్లో 172 సీట్లను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కోర్సుల్లో చేరిన యువతకు, అభ్యర్థులకు ఉపాధితో పాటు ఉద్యోగం 100శాతం గ్యారెంటీ అని అన్నారు. అసక్తిగత తాండూరు యువత ఏటీసీలో చేరేందుకు ఇది సువర్ణ అవకాశమని, 28వ తేదిలోపు వివిధ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జుబేర్ లాల, ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్, వడ్డె శ్రీనివాస్, బంటు మల్లప్ప, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, రొంపల్లి సంతోష్ కుమార్, సత్యమూర్తి దొరశెట్టి, రాము తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు..!