ఎంసీహెచ్‌ ఆసుపత్రిపై ఎమ్మెల్యే ఫోకస్..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్


ఎంసీహెచ్‌ ఆసుపత్రిపై ఎమ్మెల్యే ఫోకస్..!

– ఆసుపత్రిలో వైద్య సేవలు, వసతులపై ఆరా
– వైద్యులు, కాంట్రాక్టర్లతో మాట్లాడిన మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యే ఆదేశాలతో తనిఖీ చేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) ఆసుపత్రిపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా రోగులకు వసతులు, వైద్యం సక్రమంగా అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది.
kvcs
సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి రోగులు పొటెత్తడంతో ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆసుపత్రి సేవలను మెరుగు పరిచేందుకు కంకణం కట్టుకున్నారు. ఆసుపత్రి తనిఖీ చేసి వైద్య సేవలు, వసతులపై ఆరా తీయాలని స్థానిక నేతలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, వెంకటన్న గౌడ్, రవిరాజు, ప్రవీణ్‌ గౌడ్, జిలానీతో పాటు పలువురు నాయకులు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ అనిల్ కుమార్, చిన్నారుల వైద్యులు డా.సతీష్‌ కుమార్‌తో కలిసి ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు.

చిన్నారులు, మహిళలుతో మాట్లాడి ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో బాధితులకు వసతులు ఏవిధంగా ఉన్నాయో కూడా ఆరా తీశారు. ఇందులో కొన్ని పరిస్థితుల దృష్ట్యా వైద్యం సక్రమంగా అందలేదని, వసతులపై కూడా ఫిర్యాదులు అందాయని నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆర్ఎంఓ అనిల్ కుమార్‌తో ఫోన్‌లోనే మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగు పరచాలని, ఏమైనా మందులు, వసతుల విషయంలో ఎమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలన్నారు.

అదేవిధంగా ఆసుపత్రిలో కాంట్రాక్టర్ తో కూడా మాట్లాడి ఆసుపత్రిలో మరుగుదొడ్లు, రోగుల వార్డులు అన్ని పరిశుభ్రంగా ఉంచేలా ఆదేశించాలని సూచించారు. ఎమైనా ఇబ్బంది ఎదురైతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవైపు ఆసుపత్రిని సందర్శించిన నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదల సంక్షేమంపై దృష్టిసారిస్తుండడంపై అభినందనలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఆర్బీఓఎల్‌లో వినాయక చవితి శోభ