ఆర్బీఓఎల్‌లో వినాయక చవితి శోభ

తాండూరు రాజకీయం వికారాబాద్


ఆర్బీఓఎల్‌లో వినాయక చవితి శోభ

– మట్టి గణనాథునికి శ్రీనివాస్ రెడ్డి దంపతుల పూజలు
– పాల్గొన్న ఫ్యాక్టరీ ఉద్యోగులు, సిబ్బంది

తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో వినాయక చవితి శోభ సంతరించుకుంది. బుధవారం వినాయక చవితి సందర్భంగా ఫ్యాక్టరీ ఆవరణలో మట్టి వినాయకున్ని ప్రతిష్టించారు.
kvcs
కాంగ్రెస్ నాయకులు, ఫ్యాక్టరీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి దంపతులు హాజరై గణపయ్యకు పూజలు నిర్వహించారు. వేధ పండితుల మంత్రోచ్చరణల మధ్య వినాయకునికి పూజలు జరిగాయి. పూజ అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నేషుడు ప్రజలందరి విఘ్నాలను తొలగించాలని ఆకాంక్షించారు. గణపయ్య కృప అందరిపై మెండుగా ఉండి సుఖ సంతోషాలతో జీవించాలని వినాయకున్ని వేడుకున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికి వినాయక చవితి శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వినాయకుని కృప అందరికి సిద్దించాలి