మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
– మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు
– సాయం అందించిన పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్
బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : మృతుని కుటుంబానికి బషీరాబాద్ మండల నేతలు ఆర్థిక సాయం అందించారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన భరత్ మృతి చెందాడు.
kvcs
శనివారం ఈ విషయం తెలుసుకున్న తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు మహారాజ్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. మృతుని అంత్యక్రియల కోసం రూ. 5వేలు ఆర్థిక సాయం అందించారు.

అదేవిధంగా నవాంద్గి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ కూడా మృతుడి కుటుంబానికి అంత్యక్రియలకు చెరో రూ.5వేలు ప్రకటించారు. ఈ సాయంను స్థానిక నేతలు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ ఠాకూర్, సాయిలు గౌడ్, నర్సింలు, శ్రవణ్, డా. నర్సింలు, యాదు, రియాజ్, శేఖర్, బోనప్ప, షేక్ శభాష్, రాము నాయక్, సాబయ్య తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

అర్దరాత్రి దర్జా దొంగా..!