
తాండూరులో కొత్త కాలనీ..!
– శ్రీరామ్ నగర్‌గా నామకరణం
– వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బోర్డు ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రజలు కొత్త కాలనీని ఏర్పాటు చేసుకున్నారు. చిన్న చిన్న గల్లీలను కలుపుకుని కాలనీకి పేరు పెట్టుకోవడంతో పాటు బోర్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. గణేష్ నిమజ్జనం రోజున వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

పట్టణంలోని కొడంగల్ రోడ్డులో 13వ వార్డులోని చిన్న చిన్న గల్లీలను కలుపుతూ కాలనీవాసులు శ్రీరామ్ నగర్ గా నామకరణం చేశారు. ఈ మేరకు ఆదివారం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నేమ్ బోర్డు ను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న గల్లీలకు చిరునామాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉండడంతో ఒకే కాలనీగా నామకరణం చేసినట్లు కాలనీ వాసులు వికాస్ జోషి, రవీందర్ రెడ్డి, ఆశనప్ప, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంజయ్య, బస్వరాజ్, కృష్ణకుమార్, మహేష్ రెడ్డి, కిషోర్, మహేష్ రెడ్డి, అనంత్ రెడ్డి, నర్సింలు(సాక్షి) తదితరులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…
