మహిళలకు సూపర్‌ గిఫ్ట్..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మహిళలకు సూపర్‌ గిఫ్ట్..!
– ప్రతి ఒక్కరికి రెండు చీరలు
– మహిళ శక్తి కింద బతుకమ్మ కానుక
– చీరల పంపిణీ ఆరోజు నుంచే
– ఒక్కో శారీ ధర ఎంతంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సూపర్ గిఫ్ట్ అందించేందుకు సిద్దమవుతోంది. ప్రతి మహిళ సంబరపడే విధంగా బతుకమ్మ కానును అందించేందుకు చర్యలు చేపడుతోంది.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు అందించడం ద్వారా ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీపై కీలక ప్రకటన చేసింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళకు రెండు ఇందిరమ్మ చీరలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
kvcs
ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టబడుతోంది. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ జరగనుందని అధికారులు తెలిపారు. ప్రతి చీర విలువ రూ. 800 కాగా, ఒక్కో మహిళకూ రెండు చీరలు అందుతాయి. ఈ నాణ్యమైన చీరల ద్వారా మహిళలు.. పండుగ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన చీరల్ని ధరిస్తూ.. పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం కల్పించినట్లవుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని మహిళలకూ ఈ లబ్ధి అందుబాటులో ఉంటుంది. పంచాయితీలు, స్థానిక అధికారులు ఈ పంపిణీలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ కార్యక్రమం సక్రమంగా అమలు కావడానికి ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం మహిళ శక్తి పథకాన్ని భవిష్యత్‌లో మరింత విస్తరింపజేసే అవకాశాలను పరిశీలిస్తోంది. మహిళల ఆర్థిక సాధికారతకు ఇంకా ఎక్కువ అవకాశాలను కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి పాలసీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

మీ ఇంటి ఫోటో మీరే తీయండి..!