భగవాన్ కరీం ఇకలేరు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

భగవాన్ కరీం ఇకలేరు
– గుండెపోటుతో కన్నుమూత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు భగవాన్ కరీం ఇకలేరు. బుధవారం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. తాండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆయన సేవలందించారు. తాండూరు ప్రాంత లారీ యజమానుల సమస్యలపై తనవంతు పోరాటం చేశారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలతో పాటు రాజీకీయ ప్రముఖులతో సత్సంబందాలు కొనసాగించారు. భగవాన్ కరీ మరణం పట్ల తాండూరు రాజకీయ నాయకులు, మైనార్టీ సోదరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.