తాండూరు ఐకాన్ వుమెన్ సరళారెడ్డి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు ఐకాన్ వుమెన్ సరళారెడ్డి..!
– బెస్ట్ బిజినెస్ అవార్డు ఆదర్శనీయం
– అభినందనలు తెలిపిన చైతన్య యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కృషి, పట్టుదల ఉండే అన్నిరంగాల్లో ప్రతిభను ప్రపంచానికి చాటవచ్చని నిరూపించేందుకు తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డి మహిళ లోకానికి ఐకాన్‌గా నిలుస్తున్నారని తాండూరు చైతన్య జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ నిర్మలారెడ్డిలు అన్నారు.

ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ ఎక్సలెన్స్ బిజినెస్ -2025 అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం బుయ్యని సరళారెడ్డిని ఆమె నివాసంలో కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ నిర్మలారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. బెస్ట్ అవార్డు పొందడం పట్ల సరళారెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కృషి, పట్టుదల, అంకితభావం ఉంటే మహిళలు ఏ రంగాల్లో అయినా రాణించగలుగుతారని సరళా రెడ్డి నిరూపించారని అన్నారు. సరళారెడ్డి మహిళ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

ఇదికూడా చదవండి…

రామ మందిరంకు రూ.1.50లక్షల విరాళం