తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ

తాండూరు రాజకీయం వికారాబాద్

తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ
– మున్సిపల్ కమిషనర్ యాదగిరి
– కార్యాలయంలో వర్ధంతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు.

kvcs

బుధవారం 41వ వర్ధంతిని తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకమైందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా హుస్సేన్, టీఎంసీ రాజేంద్ర ప్రసాద్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఉమేష్, జూనియర్ అసిస్టెంట్లు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి…

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం