బీసీల ఆత్మగౌరవ బావుటా.. ఆర్.కృష్ణయ్య..!

తాండూరు రాజకీయం వికారాబాద్


బీసీల ఆత్మగౌరవ బావుటా.. ఆర్.కృష్ణయ్య..!

– అహర్నిష పోరాటాలతో సుస్థిర స్థానం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– తాండూరులో ఘనంగా జన్మదిన వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల ఆత్మగౌరవానికి ఆర్. కృష్ణయ్య బావుటలా ఎదిగారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
kvcs
ఆర్. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని 25వ వార్డు అంగన్ వాడి కేంద్రంలో విద్యార్థులకు ప్లేట్లు, బ్యాగులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి ఆర్. కృష్ణయ్య ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. 50ఏండ్లుగా అహర్నిషలు బీసీల పక్షాన పోరాటం చేస్తూ పేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన స్ఫూర్తితో బీసీ సంఘం ఆధ్వర్యంలో 20ఏండ్లుగా పనిచేయడం జరుగుతుందన్నారు.

ఆర్.కృష్ణయ్య ఆశయాలకు అనుగుణంగా బీసీల కోసం ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ సాయప్ప, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్. సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, మహిళ నాయకులు నర్సమ్మ, మంజుల, విజయలక్ష్మీ, జగదీశ్వరి, మండలాల అధ్యక్షులు నరేందర్. బసంత్ కుమార్, వెంకటేష్, పరమేష్, టైలర్ రమేష్, అశోక్, బాలాజీ ఠాకూర్, అజిత్ ఠాకూర్, జోషఫ్, గోపాల్, రాజు, అంగన్ వాడి టీచర్లు రత్నమాల, సుజాత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఫ్రీగా రూ. 2లక్షల బీమా..!