బావనోళ్ల కుటుంబంలో విషాదం
– శంకర్ యాదవ్ బాబాయ్ నర్సింలు కన్నుమూత
– విచారం వ్యక్తం చేసిన నేతలు, కిరాణా వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంకు చెందిన బావనోళ్ల కుటుంబంలో విషాధం నిండుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి భావనోళ్ల శంకర్ యాదవ్ బాబాయ్ బావనోళ్ల నర్సింలు కన్నుమూశారు.

శనివారం ఉదయం 4గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. తాండూరు మండలం చెంగోలు గ్రామానికి చెందిన బావనల్ల నర్సింలు తాండూరు పట్టణం కూరగాయల మార్కెట్లో బి నర్సింలు పేరుతో కిరాణా జనరల్ స్టోర్ నడిపిస్తున్నారు. సుమారు 50 ఏండ్లుగా వ్యాపారం నిర్వహిస్తూ అందరితో కలిసి మెలిసి మనసున్న వ్యక్తిగా నిలిచారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నర్సింలు అనారోగ్యానికి గురయ్యారు.

పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ప్రాణాలను విడిచారు. నర్సింలు అన్న కుమారుడు బావనోళ్ల శంకర్ యాదవ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేతగా కొనసాగుతున్నారు. బావనోళ్ల కుటుంబంలో నర్సింలు మరణించడంతో విషాదం నెలకొంది. నర్సింలు మృతి పట్ల తాండూరులోని కిరాణా వ్యాపారులు విచారం వ్యక్తం చేశారు. పలువురు నేతలు సానుభూతి తెలిపారు. ఈరోజు శనివారం మధ్యాహ్నం 3గంటలకు తాండూరు మండలం చెంగోల్లో నర్సింలు అంతక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


