దమ్ముంటే పదేళ్ల లెక్కలు చెప్పండి…!

తాండూరు రాజకీయం వికారాబాద్


దమ్ముంటే పదేళ్ల లెక్కలు చెప్పండి…!

– ఫీజు రియంబర్స్ బకాయిలకు గత ప్రభుత్వమే కారణం
– విద్యార్థులతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
– తాండూరు యూత్ కాంగ్రెస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై గత ప్రభుత్వ పాలకులకు దమ్ముంటే పదేళ్ల లెక్కలు చెప్పాలని తాండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.
kvcs
శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు ఓ ప్రకటనలో మాట్లాడారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దర్నాలలో అవాకులు, చవాకులు పేలడాన్ని ఖండించారు. ముఖ్యంగా గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన ఫీజు రియంబర్స్ మెంట్ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన కాలేజీ కోసం ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించిందని విమర్శించారు.

రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 60వేల ఉద్యోగాలను భర్తి చేసిందని గుర్తుచేశారు. ఫీజు రియంబర్స్ మెంట్ ను అడ్డం పెట్టుకుని విద్యార్థులతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా గత పదేళ్లలో హైదరాబాద్ రోడ్డు గురించి మాట్లాడని నేత ఇప్పుడు తాండూరు రోడ్ల గురించి మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అగ్గనూర్ వీరేశం, మ హేష్, అల్తాఫ్. సుధాకర్, రాఘవేందర్ రెడ్డి, శ్రీహరి, రఫీక్, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బీసీల ఆత్మగౌరవ బావుటా.. ఆర్.కృష్ణయ్య..!