సూప‌ర్ రాబిట్..!

జాతీయం

సూప‌ర్ రాబిట్..!
– ప్రాణాల కోసం రైలు ముందు ప‌రుగెత్తిన కుందేలు
– నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న విడీయో
ద‌ర్శిని బ్యూరో : ప్రాణాపాయ ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా బ్ర‌తుకు జీవుడా అంటూ ఇష్ట‌దైవాల‌ను త‌ల‌చుకుంటారు. కొన్ని సంద‌ర్భాల‌లో మాత్ర‌మే మ‌న‌షులు గాని, జంతువులుగాని స‌మ‌య స్పూర్తి, ఆత్మ‌విశ్వాసం క‌న‌బ‌రిచి ప్రాణాల‌ను కాపాడుకుంటారు. ఇలాంటి ఘ‌ట‌నలు, దృశ్యాలు అప్పుడ‌ప్పుడు చూస్తాం.. వింటాం. అలాంటి స‌మ‌య‌స్పూర్తి, ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించిన ఓ కుందేలు విడీయో ద్వారా నెటిజ‌న్ల నుంచి సూప‌ర్ రాబిట్ అంటూ కితాబుల‌ను అందుకుంటుంది. జంతువుల కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ ViralHog ఈ వీడియోను తన సర్టిఫైడ్ పేజీలో పోస్ట్ చేసింది. ఓ రైలు బ్రిడ్జి ప‌ట్టాల మ‌ద్య ఓ కుందేలు ఉండిపోయింది. అదే స‌మ‌యంలో ఓ రైలు అటుగా వెళుతోంది.
గ‌మ‌నించిన కుందేలు రైలు ముందు ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ప‌రుగు లంకించింది. ఉత్కంఠభరితంగా సాగే 38 సెకన్ల వీడియోను ఒక్క ఫేస్‌బుక్‌లోనే 9.8 మిలియన్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారులు వీక్షించగా.. 20,000 మందికి పైగా వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. వేలాది మంది వీడియోపై కామెంట్ చేశారు.

ఈ వీడియో చూస్తే ఈ వీడియోను రైలు డ్రైవర్ లేదా కో-డ్రైవర్ స్వయంగా చిత్రీకరించిన‌ట్లు తెలుస్తోంది.

https://www.facebook.com/watch/?ref=external&v=310954183926821