ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం
– జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి రాజు
– విద్యార్థులకు కలర్ బెల్టు, ఫిట్నెస్ పరీక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మరక్షణకు తైక్వాండో విద్య ఎంతో దోహదపడుతుందని వికారాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఆర్. రాజు అన్నారు.
kvcs
శుక్రవారం తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో విద్యార్థులకు తైక్వాండో కలర్ బెల్టు, ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో తైక్వాండో విద్య నేర్చుకోవడం చాలా అవసరమన్నారు.

దీని ద్వారా ఆత్మరక్షణ పొందడంతో పాటు విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ రే.వ మాదాను జోసఫ్, డీన్ ఆఫ్ అకాడామిక్స్ సతీషన్ మాట్లాడుతూ తైక్వాండో వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అలవరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో కోచ్ పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మోడీ దేశభక్తి.. గర్వకారణం..!