మోడీ దేశభక్తి.. గర్వకారణం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మోడీ దేశభక్తి.. గర్వకారణం..!
– మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత
– ఆపరేషన్ సింధూర్ వ్యాసరచన విజేతలకు బహుమతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ రక్షణ, దేశభక్తి పెంపొందించడంతో ప్రధాని నరేంద్ర మోడి కృషి అందరికి గర్వకారణమని బీజేపీ మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శి, తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ అన్నారు.
kvcs
నరేంద్ర మోడి జన్మదిన సేవా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8,9,10వ తరగతి విద్యార్థులకు సాహు శ్రీలత ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా సాహు శ్రీలత మాట్లాడుతూ దేశం అభివృద్ధికి, దేశ ప్రజల సంక్షేమానికి ప్రధాని నరేంద్రమోడి సరైన నాయకుడు అని కొనియాడారు. దేశ రక్షణలో భాగంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశభక్తిని నిరూపించుకున్నారని అన్నారు. దేశభక్తి, సంక్షేమం కోసం మోడీ చేస్తున్న కృషి అందరికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, మాజీ కౌన్సిలర్లు కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, కృష్ణ, ప్రహాల్లాద్, కిరణ్, పాఠశాల హెచ్ఎం అనురాధ, అనంతప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సుశాంత్‌కు మెరుగైన వైద్యం అందించాలి