గాయత్రిలో హిందీ దివస్…!
– విద్యార్థులకు పోటీలు..
– హిందీ దివాస్ పై ఎగ్జిబిషన్
– బహుమతులు అందజేసిన కరెస్పాండెంట్
కోడంగల్, దర్శిని ప్రతినిధి : కోడంగల్ పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాలలో శుక్రవారం హిందీ ఉపాధ్యాయుడు ఇస్మాయిల్,ఉపాధ్యాయురాలు సమీనా ఆధ్వర్యంలో హిందీ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన పాఠశాల కరెస్పాండెంట్ రాము మాట్లాడుతూ దేశ అధికార భాషగా హిందీని స్వీకరించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం హిందీ దివాస్ జరుపుకుంటామని తెలిపారు.

దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను సెప్టెంబర్ 14, 1949న భారతదేశ అధికారిక భాషగా స్వీకరించారని, మొదటి హిందీ దివస్ సెప్టెంబర్ 14, 1953న నిర్వహించారని గుర్తుచేశారు. హిందీ దినోత్సవ నేపథ్యం, భాషా ప్రాముఖ్యత, భాషా నైపుణ్యత, గొప్పతనం గురించి వివరించారు. ఈ సందర్భంగా హిందీ కవుల డ్రాయింగ్, పద్య పఠన, ఎగ్జిబిషన్, ఎస్సే రైటింగ్, పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రంజిత, అంబ్లియా, రమేష్, సత్యనారాయణ, మహేశ్వరి, స్రవంతి, శకుంతల, సరిత, రాధిక, ఉష, సిహెచ్.సరిత, వ్యాయామ ఉపాధ్యాయుడు వంశీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

