యువకుడిపై కత్తితో దాడి..!
– కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని తండ్రి ఘాతుకం
– దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు
– యాలాల పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరు లేని సమయంలో తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడి పై తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువకుడు తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి.

ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం యాలాల మండలం బెన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అమృతప్ప అదే గ్రామానికి చెందిన మల్లప్ప కూతురు(మైనర్ బాలిక)తో బుధవారం రాత్రి ఎవరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మల్లప్ప కత్తితో అమృతప్పపై కత్తితో దాడి చేశాడు. ఈక్రమంలో అమృతప్ప తలకు, చేతికి గాయాలయ్యాయి.

అమృతప్ప తృటిలో తప్పించుకున్నాడు. గాయాలతో చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా తమ కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని అమృతప్పపై ఫోక్సో కేసు పెట్టాలని బాలిక తండ్రి మల్లప్ప యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై కత్తితో దాడి చేసిన మల్లప్పపై చర్యలు తీసుకోవాలని బాధిత యువకుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తులు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

ఇదికూడా చదవండి…

