డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్
– కాళేశ్వరంపై పీసీ ఘోష్ రిపోర్టు బూటకం
– అబద్ధాలతో పాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
– బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజీపీ కుట్ర రాజకీయాలు
– తాండూరులో బీఆర్ఎస్ పార్టీ నేతల దర్నా
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల్ రెడ్డితో పాటు నేతలు సాయిపూర్ నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలనా అంటూ హోరెత్తించారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంజుగుల శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. ఇచ్చిన హామిలను అమలు చేయడం చేతకాగ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ తయారు చేసిన రిపోర్టు అంతా బూటకమని అన్నారు. అందరిని తప్పుదోవ పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో పాలన చేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లె కుట్రలకు పాల్పడుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా ఆ రెండు పార్టీల వైఫల్యాలను ఎండగడుతామని, ప్రజా | క్షేత్రంలో నిజాయితిని నిరూపించుకుంటామని అన్నారు. అనంతరం దర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ కన్వీనర్ శకుంతల. మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సలీం. నాయకులు రాంలింగా రెడ్డి, రమేష్, మాజీ కౌన్సిలర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, ముక్తార్, నేతలు జనార్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, అనంతయ్య, ఈర్షాద్. చందు. ముస్తఫా, వెంకటయ్య, వడ్డె రాములు, కృష్ణ, రవి, శేఖర్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

