పసుపు పాలు పవర్‌ ఫుల్..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

పసుపు పాలు పవర్‌ ఫుల్..!
– ఒత్తిడిని తగ్గించే గుణాలు
– జలుబు, ఫ్లూ వ్యాధుల నుంచ రక్షణ
– ఎలా తయారుచేసి తీసుకోవాలో తెలుసుకోండి
దర్శిని డెస్క్: పాలలో పసుపు కలిసి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపు పాలును తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మంచి నిద్రను పొందుతారు అలాగే ఎముకలు, కండరాల ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే పాలలో ఉండే కాల్షియం, బి12, విటమిన్ డితో పాటు పసుపు కూడా ప్రయోజనాలను అందిస్తుంది.

బి12 శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన కాంపౌండ్ వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి, నిద్రలేమిని తగ్గించడానికి సహాయపడుతుంది.

పొందే ప్రయోజనాలు
పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పసుపులోని కాల్షియం, విటమిన్ డి ఎముకలను బలపరుస్తాయి. దాని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులను నివారిస్తాయి. పసుపు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారి, మంచి నిద్ర వస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

kvcs

తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో పాలు తీసుకోండి. దానికి ఒక చిటికెడు పసుపు పొడి కలపండి. మీకు కావాలనుకుంటే రుచి కోసం కొద్దిగా తేనె లేదా బెల్లం కలపవచ్చు. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

వీళ్లు తాగితే డేంజర్:
ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా కొందరు ఈ పాలను తాగడం మంచిది కాదు. పిత్తాశయ సమస్యలు ఉన్నవారు. రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు. ఇనుము లోపం ఉన్నవారు. పసుపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని, కానీ ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఇదికూడా చదవండి…

42శాతం రిజర్వేషన్లు పచ్చి మోసం..!