గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
– రక్తపోటు నియంత్రణకు అవగాహన పెంచుకోవాలి.
– తాండూరు ఐఎంఏ అధ్యక్షులు డా. జయప్రసాద్
– ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా రన్ ఫర్ హెల్తీ హార్ట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఇండియన్ మెడికల్ అసోసియె షన్(ఐఎంఏ) తాండూరు అధ్యక్షులు, సాయితరుణ్ అసుపత్రి వ్యవస్థాపకులు డా. జయప్రసాద్ అన్నారు. సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తాండూరు లయన్స్ క్లబ్, పతంజలీ యోగా సమితి. ఆర్య సమాజ్ యువ జాగృతి అధ్యక్షులు రన్ ఫర్ హెల్తీ హార్ట్ ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సాయి తరుణ్ ఆసుపత్రి వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయా సంఘాల సభ్యులు, యువకులు ఉత్సహాంగా పాల్గొన్నారు. అనంతరం సాయితరుణ్ ఆసుపత్రిలో గుండె ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా.జయప్రసాద్ మాట్లాడుతూ గుండెపోటుపై ఎలాంటి అపోహలు పెంచుకోవద్దన్నారు. ఆరోగ్యవంతమైన జీవనశైలితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలపై సొంత నిర్ణయాలు పాటించకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణకు అవగాహన పెంచుకోవాలన్నారు. అదేవిధంగా పతంజలి యోగా సమితి అధ్యక్షులు, యోగా గురువు ప్రవీణ్ మాట్లాడుతూ యోగా సాధనతో ఆరోగ్య వంతమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. యోగా ద్వారా డయాబెటిస్, బీపీని నియంత్రించడం సాధ్యపడుతుందని అన్నారు.

అథ్లెటిక్ మంకాల సంతోషీ మాట్లాడుతూ మహిళలు కూడా యోగా, నడక అలవాటతో క్రీడల్లో రాణించవచ్చన్నారు. యువజాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ శారీరక, మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి పునాది అవుతుందని అన్నారు. చెడు అలవాట్లకు అందరు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్. శరణు బసప్ప, మాంకాల్ నటరాజ్, బి. గౌరీ శంకర్, ఆర్య సమాజ్ సభ్యులు మోహన్, అస్తికర్ సంతోష్, నారాయణ, లక్ష్మణ్ చారి, యోగా సమితి సభ్యులు విజయ కుమార్, లక్ష్మణ్. రమేష్. గోపాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రమేష్ రెడ్డి, కృష్ణ, రాజు, రవీందర్ రెడ్డి, భాస్కర్, భీమేష్ చారి, సల్లా రవి, వేణుమాధవ్, ప్రవీణ్, విశాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

