ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
– పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదు
– వివరాలు వెల్లడించిన సీఐ సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేకాట ఆడుతున్న ఐదుగురు నిందితులను తాండూరు పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం జరిగింది: పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణం టీఆర్సీ క్లబ్ సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించగా బురాన్నప్ప, రాఘవేందర్, సాయిలు, వెంకట్, ప్రహాల్లాద్ లను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి రూ.3740ల నగదు, 4 సెల్ ఫోన్లు, పేకాట ముక్కలను స్వాదీనం చేసుకున్నారు. దీంతో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా నిషేధిత జూదం, పేకాట ఆడితే చట్టరిత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..

