ఇసుక మాఫీయా.. వర్సెస్ పోలీస్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇసుక మాఫీయా.. వర్సెస్ పోలీస్..!
– రవాణాను అడ్డుకున్నందుకు.. ఖాకీలకే వార్నింగ్
– ట్రాక్టర్‌ను పోలీసుల మీదకు ఎక్కించే యత్నం
– బషీరాబాద్‌ మండలం దామర్‌చేడ్‌లో ఘటన
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫీయా రెచ్చిపోయింది. ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల మీదుకే ట్రాక్టర్‌ను ఎక్కించే ప్రయత్నం చేసినట్లు తీవ్ర దుమారం రేగుతోంది.

ఈ సంఘటన బషీరాబాద్‌ మండలంలోని దామర్‌చేడ్‌ గ్రామంలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మండలం దామర్ చెడ్ గ్రామంలో అక్రమంగా రవాణా అవుతోందని పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న బషీరాబాద్ పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని అక్రమ ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఇసుక రవాణాకు సంబంధించిన పత్రాలను చూపించాలని కోరారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించే యత్నం చేస్తుండగా జామ్లా నాయక్ తండాకు చెందిన చవాన్ శ్రీను పోలీసుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది.
kvcs
ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆగ్రహించి.. మీకెందుకు వివరాలు చెప్పాలి.. ? వాహనానికి అడ్డు తప్పుకోండి అంటూ హెచ్చరించాడు. మాటా మాటా పెరగడంతో వాగ్వివాదం.. వివాదాస్పదంగా మారింది. పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పట్టుకున్న డ్రైవర్‌ను విడిపించేందుకు రాజకీయ నేతలు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతుంది. ఇసుక మాఫీయా.. వర్సెస్ పోలీస్ అనే చందంగా మారిన వ్యవహారం ఇంలా ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని ఆసక్తిని రేపుతోంది.

ఇదికూడా చదవండి…

బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం..!