బీసీ రిజర్వేషన్లు తేల్చాకే.. ఎన్నికలకు వెళ్లాలి
– 42 శాతం సాధించుకునేందుకు ఐక్యంగా ఉద్యమిద్దాం
– అఖిలపక్ష నాయకుల మద్దతుతో బీసీ బంద్
– పార్టీతకతీతంగా పాల్గొని జయప్రదం చేద్దాం
– సన్నాహాక సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని తేల్చిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని తాండూరు అఖిలపక్ష పార్టీల నాయకులు అన్నారు. బుధవారం బీసీ జేఏసీ నాయకులు కందుకూరి రాజ్ కుమార్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీజేఎస్, సీపీఐ, సీపీఎం అఖిలపక్ష పార్టీలతో పాటు బీసీ, ఎస్సీ, ఎసీ, మైనార్టీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైక్టోర్టులో స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 18న జరిగే తాండూరు బంద్ అనే అంశంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రధాని మోడి, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకరావాలన్నారు. రిజర్వేషన్ల అంశం తేలిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈనెల 18న నిర్వహించే తాండూరు బంద్ కార్యక్రమాన్ని పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బీసీల బంద్ జయప్రదానికి అన్ని పార్టీల, సంఘాల నాయకులు జై కొట్టారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు రాజుగౌడ్, మురళీకృష్ణ గౌడ్, నాయకులు ఉత్తమ్ చంద్, డా. సంపత్ కుమార్, బీజేపీ నాయకులు యు.రమేష్ కుమార్, పటేల్ విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, టీజేఎస్ నాయకులు సోమ శేఖర్, మాజీ ఫ్లోర్ లీడర్లు లింగదలి రవికుమార్, సుమిత్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు శ్రీనివాస్, మల్కయ్య, బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, అనిత, సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, జుంటుపల్లి వెంకట్, పరమేష్, లక్ష్మణ్ చారి, అబ్బని బసయ్య, పర్యాద రామకృష్ణ, కురుమ సంఘం డివిజన్ గౌరవాధ్యక్షులు న్యాయవాది గోపాల్. పూజారి పాండు, వివిధ పార్టీల, కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

