వ్యాపారానికి రూ. 20లక్షల లోన్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

వ్యాపారానికి రూ. 20లక్షల లోన్..!
– ఎలాంటి ష్యూరిటీ లేకుండా మంజూరు
– 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వారు అర్హులే
– కేంద్ర ప్రభుత్వ స్కీంలో రుణాలు ఎలా ఇస్తారంటే..?
దర్శిని డెస్క్ : సొంతంగా వ్యాపారం చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక ఎక్కువ మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY)’. ఈ పథకం ద్వారా యువతకు, మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఎలాంటి హామీ లేకుండా రూ .50,000 నుంచి రూ. 20 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. PMMY పథకం కింద మహిళలకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి. వ్యవసాయేతర రంగాల్లో నిమగ్నమై ఉన్న చిన్న తరహా సంస్థలకు, వ్యక్తులకు రుణాలు అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గ్రామీణ, వాణిజ్య, కో–ఆపరేటివ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నుంచి పొందదవచ్చు. ఈ రుణాలను మూడు విభాగాల్లో అందిస్తారు.

దరఖాస్తులు ఎలా చేసుకోవాలంటే..?
18 ఏళ్లు పైబడి 60 ఏళ్లలోపు వారందరూ ఈ రుణాలు పొందేందుకు అర్హులు. దరఖాస్తుతో ఆధార్, పాన్‌కార్డ్, ఓటరు ఐడీ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్, ఏడాది బ్యాంక్‌ స్టేట్‌మెంట్, వ్యాపారానికి సంబంధించిన స్కిల్‌ సర్టిఫికెట్‌ను జత చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలయితే క్యాస్ట్‌ సర్టిఫికెట్‌నూ పెట్టాలి. ప్రధాన మంత్రి ముద్రా పథకంలో భాగంగా 3 రకాల రుణాలు (లోన్లు) ఇస్తారు. శిశు రుణాలు, కిషోర రునాలు, తరుణ్‌, తరుణ్‌ ప్లస్‌ రుణాలు మంజూరు చేస్తారు. తరుణ్‌ ప్లస్‌ లోన్‌కి ఐటీఆర్‌ కూడా పొందుపరచాలి. లబ్ధిదారులకు ముద్రా కార్డ్ కూడా జారీ చేస్తారు. ఇది ఒక డెబిట్ కార్డ్. దీని ద్వారా లబ్ధిదారుడు తమ లోన్ ఖాతా నుంచి అవసరమైనప్పుడు డబ్బు తీసుకోవచ్చు.
kvcs

ఈ వ్యాపారాలకు రుణాలు
వ్యాపారం పెట్టాలనుకుంటున్న ప్రాంతం, వ్యాపార వృద్ధికి అక్కడున్న అవకాశాలను బట్టి ఎంత రుణమివ్వాలో నిర్ణయిస్తారు. కూరగాయల అంగళ్లు, విస్తరాకుల తయారీ, పేపర్‌ కప్స్, సారీ రోలింగ్, లాండ్రీ, కిరాణా షాప్స్, కర్రీపాయింట్స్, పిండి మరలు, జిరాక్స్, ఇంటర్నెట్, డయాగ్నస్టిక్స్, స్టేషనరీ నుంచి ఆటో, క్యాబ్, ట్రాక్టర్, వరికోత మిషన్‌లు, జేసీబీల దాకా దేనికైనా రుణాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, సమస్యలను ఎలా అధిగమించాలి వంటివాటి మీద MSME,DIC, బ్యాంకింగ్‌ రంగాల వారు అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం కూడా శిక్షణ కార్యక్రమాలనూ చేపడుతోంది.

నిబంధనలు ఇవే..
రుణాల్లో ఎగవేత రికార్డ్‌ ఉండకూడదు. క్రెడిట్‌ ట్రాక్‌ బాగుండాలి. ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ అవసరం. తీసుకున్న రుణాన్ని అయిదేళ్లలోపు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. సబ్సిడీ సదుపాయం లేదు. కానీ టాప్‌ అప్, సీసీ లోన్స్‌ను పొందే వీలుంటుంది. దీనికి వస్తు ఉత్పత్తి, మార్కెట్, సేవారంగాల్లో మంచి అవకాశాలున్నాయి.

ఇదికూడా చదవండి…

పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల నమోదు