తాండూరులో ఉచిత క్యాన్సర్ స్ర్ర్కీనింగ్ క్యాంపు

ఆరోగ్యం తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

తాండూరులో ఉచిత క్యాన్సర్ స్ర్ర్కీనింగ్ క్యాంపు
– రెనోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు
– స్థలం, డేట్, టైమింగ్ వివరాలు ఇవే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఉచిత క్యాన్సర్ స్ర్కీనింగ్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ రెనోవా సెంచరీ ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.

ఈనెల 23 మంగళవారం తాండూరు పట్టణంలోని సాయితరుణ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాంపు కొనసాగుతుందని చెప్పారు.

అతిగా బరువు తగ్గడం, కడుపునొప్పి, రోమ్ములో గడ్డలు, కడుపులో గడ్డలు, అధిక రుతుస్రావం, నోటిలో పుండ్లు, మానని పుండ్లు, దీర్ఘకాలిక దగ్గు, కామెర్లు తదితర లక్షణాలు ఉన్న వారు క్యాంపులో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. ఈ క్యాంపులో ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్ర్కీనింగ్ కోసం ధర్మోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్‌ స్ర్కీనింగ్ కోసం పాప్ స్మియర్ చేయడం జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌ లోని రెనోవా సెంచరీ ఆసుపత్రి నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యులు వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. రిజిస్ట్రేషన్, ఆపాయింట్ మెంట్ కోసం సెల్‌ : 9390368070, 6309785149లకు సంప్రదించాలని, తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

రామ మందిరానికి భక్తుల విరాళాలు